వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేస్తున్నారు..ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కరోనా తర్వాత ఇంకా మొదలు కాలేదు.. 'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత చాలా టైం తీసుకుని మరీ బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు..