తాజాగా సమాచారం ప్రకారం నవంబరు 4 నుంచి చిరు మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని, ‘ఆచార్య’ మళ్లీ పట్టాలెక్కబోతోందని వార్త లొచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో హుషారు పుట్టింది. కానీ నాలుగో తేదీన ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం కావట్లేదని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని వార్తలొస్తున్నాయి. మధ్యలో చిరు లూసిఫర్ లేదా వేదాళం రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడని కూడా చెబుతున్నారు. దీంతో ‘ఆచార్య’తో వచ్చిన ఇబ్బందేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ కొంత ఇబ్బందిగా ఉన్నాడని దాన్ని మార్చడానికి కొంత టైం అడగగా చిరు ఒకే చెప్పాడని తెలుస్తుంది