మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు వచ్చింది.. తొలి సినిమా నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైనా కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..