రీ ఎంట్రీ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టి సైరా తో ఆ హిట్ జోష్ ను కంటిన్యూ చేసిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు.. తొలి సినిమా నుంచి మెసేజ్ కమ్ కమర్షియల్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న కొరటాల శివ కి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు.. దాంతో ఎన్నో అంచనాల నెలకొన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. చిరు రికమెండేషన్ తో ఈ సినిమా కొరటాల శివ చేస్తున్నాడని తెలుస్తుంది..