టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కానీ పరిస్థితి.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. ఇటీవలే రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టాడు.. ఆ సినిమా తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ని మొదలుపెట్టాడు.. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోగా అన్ని సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులు అవుతున్నా పుష్ప సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోకపోవడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది.