హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టిన తర్వాత చాలా మారిపోయాడని చెప్పాలి.. ఆ సినిమా కి ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి కరెక్ట్ టైం లో ఆ సినిమా హిట్ ఇచ్చిందని చెప్పాలి.. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ ఉత్సాహంతో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలున్నాయి..మొదటిసారి డ్యూయల్ రోల్ చేయడంతో పాటు క్లాస్ మాస్ కు నచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కావడంతో ఇస్మార్ట్ శంకర్ ట్రాక్ రికార్డుని కొనసాగిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. తమిళంలో భారీ హిట్టు కొట్టిన తడం రీమేక్ గా రూపొందిన రెడ్ మీద అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు.