పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్సు చేసి అయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చినా ఆ తర్వాత సినిమాలు చేస్తాడో లేదో అని కొంత అనుమానం తో పాటు అసహనం కూడా వారిలో రోజు రోజు కి ఎక్కువవుతుంది.. ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కనీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలన్న కోరిక నెరవేరుతుంది అని ఫాన్స్ అంటున్నారు.. ఏదేమైనా అయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో నే ఉండాలనుకునేవారు ఎక్కువగా ఉన్నారు..