పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి.. వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కానీ మిగితా మూడు సినిమాలు ఇంకా షూటింగ్ కి వెళ్ళలేదు.. ఎప్పుడు వెళతాయో కూడా చెప్పలేం.. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ వకీల్ సాబ్ సినిమా తర్వాత తెరకెక్కుతుండగా, ఆ తర్వాత క్రిష్ , హరీష్ శంకర్ సినిమాలు తెరకెక్కనున్నాయి.. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా ని చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.