లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..సెన్సేషనల్ దర్శకుడు శంకర్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. రోబో తర్వాత అయన దర్శకతంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరోలు శింబు, సిద్ధార్థ్ లు ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. అయితే ఈ సినిమా ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఆదినుంచి ఈ సినిమా కి అడ్డంకులు వస్తున్నాయి.. తొలుత నిర్మాతలకు, దర్శకుడికి పొసగక ఈ సినిమా షూటింగ్ జరగలేదు..