ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలొడీస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ గానూ, ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.