ప్రస్తుతం ఈ చిత్రం కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంటుండగా, అభిషేక్ బచ్చన్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో ఆయన బట్టతలతో కళ్లజోడు పెట్టుకొని కనిపిస్తున్నాడు. 2012లో విద్యాబాలన్ ప్రధానపాత్రలో కలిసి నటించిన కహానీ చిత్రంలోని కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ నటిస్తున్నారు.