ఈ సినిమాలో శృతీ ఒక పాపకు తల్లిగా నటించింది. ఇక ఈ విషయమై ఓ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన శృతీ. ‘నేను సినిమా కథ విన్నప్పుడు తల్లి పాత్ర చేయాలా..? వద్దా..? అనే ఆలోచన నాలో అస్సలు రాలేదు. ఏవో లెక్కలు వేసుకొని సినిమాలు చేయడం పాతకాలపు సిద్ధాంతం. నా కెరీర్ ఆరంభం నుంచి పాత్రల పరంగా ప్రయోగాలు, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను.