బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా తనదైన శైలిలో దూసుకెళ్తుంది. ఇప్పుడిప్పుడే ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. సుకుమార్ లాంటి అగ్ర దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు.