సినీ ఇండస్ట్రీకి నాజర్ సుపరిచిత వ్యక్తి. టాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. ఇండియా వ్యాప్తంగా అన్ని సినీ రంగాల్లో ఆయన నటించారు. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాజర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ స్టార్ హీరోలతోనూ నాజర్ నటించారు. సౌత్ ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ.. పాన్ ఇండియా రేంజ్ మూవీస్‌లో నటించే సత్తా అతి కొద్ది మందిలో మాత్రమే ఉంది.