బోయోపాటి సినిమా అంటే మాస్ ఊర మాస్ అని ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. సరైనోడు తో అల్లూ అర్జున్ లో క్లాసీ మాస్ యాంగిల్ ని బయటకి లాగి ప్రపంచానికి చూపించాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఆయన కొత్త చిత్రం జయ జానకీ నాయక విడుదల కి సిద్దం అవుతోంది. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం లో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తూ ఉండగా రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మాస్ కి కాస్త దూరంగా ఒక సూపర్ లవ్ స్టోరీ తో ప్రయోగం చేసాడు బోయపాటి.


ఈ చిత్రం తరవాత ఆయన చెయ్యబోయేది ఎవరితో అంటూ ఇప్పటికే ఇండస్ట్రీ లో టాక్ నడుస్తూ ఉండగా బాలకృష్ణ ఫాన్స్ మాత్రం బోయపాటి తమ హీరోతోనే చేస్తాడు అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ టాక్ ని పక్కకి నెడుతూ బాలయ్య తో కాకుండా అఖిల్ అక్కినేని తో బోయపాటి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని న్యూస్ ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం విక్రం కుమార్ డైరెక్షన్ లో అఖిల్ ఒక రొమాంటిక్ మూవీ చేస్తూ ఉండగా ఇలాంటి


ఒక ఫీల్ గుడ్ సినిమా తరవాత అఖిల్ లోని మాస్ యాంగిల్ చూపిస్తే బాగుంటుంది అనేది నాగార్జున ఐడియా అట సో ఖచ్చితంగా ఒక మాస్ సినిమా పడాలి , అది జనాలకి రీచ్ అవ్వాలి అంటే బోయపాటి నే కరక్ట్ కాబట్టి ఇప్పటికే బోయపాటి ని పర్సనల్ గా కలిసి చర్చలు జరుపుతున్నారట నాగార్జున. పైగా విక్రం తో సినిమా తరువాత ప్రాజెక్టును అఖిల్ ఎవరితోను కమిట్ కాలేదు. అందువలన బోయపాటితో ఫిక్స్ కావొచ్చని చెప్పుకుంటున్నారు. బాలయ్యతో మూవీ కంటే ముందే బోయపాటి ఈ సినిమా చేస్తాడేమో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: