మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మనసులోని భావాలు బయట పెట్టకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అయితే ఆ నవ్వుల వెనుక ఎవరికీ తెలియని ఒక విలన్ ఉన్నాడు అంటూ నటుడు బ్రహ్మాజీ త్రివిక్రమ్ పై జోక్ చేస్తూ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
త్రివిక్రమ్ చాల తీక్షణంగా ఆలోచిస్తూ ‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫోటో ఇది. త్రివిక్రమ్ తన సాధారణ శైలికి భిన్నంగా ఈమూవీ షూటింగ్ లో ఉంటున్నాడని బ్రహ్మాజీ అభిప్రాయ పడుతున్నాడు. ఎప్పుడు అందర్నీ నవ్విస్తూ ఉండే త్రివిక్రమ్ ను ఇలాంటి సీరియస్ లుక్ లో చూడటం తనకు చాల కష్టంగా ఉంది అంటూ బ్రహ్మాజీ అభిప్రాయ పడుతున్నాడు.
అక్టోబర్ దసరా ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ మూవీ రిజల్ట్ త్రివిక్రమ్ కు అత్యంత కీలకంగా మారడంతో ఇలా త్రివిక్రమ్ తనలోని విలనీని బయటపెడుతూ అందర్నీ కంట్రోల్ లో పెడుతున్నాడనుకోవాలి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘అరవింద సమేత’ టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చినా ఇంకా త్రివిక్రమ్ మోహంలో టెన్షన్ తగ్గలేదని టాక్.
దీనికి కారణం ఈమూవీ టీజర్ ను చూస్తుంటే ‘అజ్ఞాతవాసి’ టీజర్ గుర్తుకు వస్తోంది అంటూ కొందరు వేస్తున్న సెటైర్లు తాను మరిచిపోదామనుకున్నా జనం తరుచు తనకు ‘అజ్ఞాతవాసి’ ని గుర్తుకు చేయడం త్రివిక్రమ్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈనేపధ్యంలో ప్రస్తుతం త్రివిక్రమ్ మూడ్ ను అందరికీ తెలిసి వచ్చేలా బ్రహ్మాజీ ఇచ్చిన లీక్ తో త్రివిక్రమ్ విలనీ లుక్ ను చూసి చాల మంది షాక్ అవుతున్నారు..