వచ్చే సంక్రాంతి బయోపిక్ మూవీల వార్ గా మారబోతున్న నేపధ్యంలో ఆ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్ మూవీల వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ బయో పిక్ లో చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న నేపధ్యంలో అలాంటి గ్లామర్ వైఎస్ఆర్ జీవితం పై తీస్తున్న ‘యాత్ర’ బయోపిక్ కు కూడ తీసుకు రావడానికి నిర్ణయించారు. 
Vijay Devarakonda starts advertisements
ఈ ప్రయత్నాలలో బాగంగా ‘యాత్ర’ ‘బయో పిక్ కు విజయ్ దేవరకొండ మ్యానియా టచ్ చేయబోతు ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ బయోపిక్ లో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి చేస్తున్న నేపధ్యంలో మరో కీలక పాత్ర అయిన వైఎస్ఆర్ కుమారుడు జగన్ పాత్రను విజయ్ దేవరకొండ చేత నటింప చేస్తే ఈమూవీ చాల సులువుగా ప్రేక్షకులలోకి వెళ్ళి పోతుంది అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్. 
Vijay Devarakonda
వాస్తవానికి ‘యాత్ర’ బయోపిక్ లో జగన్ పాత్ర చాల చిన్నదిగా కనిపిస్తుంది. ఈమూవీ స్క్రిప్ట్ అంతా రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి మరోసారి తెలుగు వారికి గుర్తు చేసేలా ఈమూవీ స్క్రిప్ట్ ను తీర్చి దిద్దారు. అయితే విజయ్ దేవరకొండ ఈమూవీలో జగన్ గా నటించడానికి ఒప్పుకుంటే అతడి పాత్రను కూడ పెంచే ఆలోచనలలో ఈమూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. 

అంతేకాదు జగన్ పాత్రలో నటించినందుకు విజయ్ దేవరకొండకు చాల భారీ పారితోషికం కూడ ఆఫర్ చేస్తున్నట్లు టాక్. ఈవార్తలే నిజం అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రాంత సూపర్ పవర్ స్టార్ గా కనెక్ట్ అవుతున్న విజయ్ దేవరకొండ కోస్తా జిల్లాల ప్రేక్షకులకు ముఖ్యంగా రాయలసీమ జనానికి బాగా కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది మరి యాత్ర నిర్మాతల వ్యూహానికి ఎంత వరకు విజయ్ సహకరిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: