బిగ్ బాస్ లో టైటిల్ పోరు మొదలైంది. అటు కంటెస్టెంట్స్ లో హౌస్ లో పోరాడుతుంటే వారి అభిమానులు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్లు చేస్తున్నారు. హౌస్ లోని ఐదుగురిలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య గట్టి పోటీ నెలకొని ఉందని వినిపిస్తుంది. వీరి అభిమానులు సోషల్ మీడీయాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే  బిగ్ బాస్ గెలవడానికి కంటెస్టెంట్స్ కి ఉన్న బలాలేంటనేది ఒక్కసారి చూస్తే,


ముందుగా ఆలీ, రీ ఎంట్రీ అయ్యాక అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాస్క్ లు బాగానే ఆడినప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో చివరన ఉంటాడు. బాబా ని టార్గెట్ చేస్తున్నాడన్న అపవాదు కూడా ఉంది. ఆ విషయం పక్కన పెడితే శివజ్యోతి అభిమానులు ఆలీకి ఓట్లేసే అవకాశం ఎక్కువగా ఉంది.  ఇక వరుణ్ విషయానికి వస్తే, అతని అతి ముఖ్యమైన బలం ఏంటంటే, అందరితో కలుపుగొలుగా ఉండడం.అలాగే ఎవరితోనూ వ్యక్తిగత ద్వేషం పెట్టుకోకపోవడం.


ఇక రాహుల్, రాహుల్ కి అతి ముఖ్యమైన బలం శ్రీముఖినే. ఎందుకంటే ఆమెతో గొడవ పెట్టుకోవడం వల్లనే రాహుల్ మీద సింపతీ పెరిగి అవి ఓట్ల రూపంలో వచ్చాయని అంటున్నారు. అదీ గాక పునర్నవి రాహుల్ గురించి సోషల్ మీడియాలో బాగా క్యాంపెయిన్ చేస్తుంది. కాబట్టి ఆ బలం కూడా అతనికి తోడవుతుంది. ఇక  శ్రీముఖి, శ్రీముఖికి మొదటి నుండి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. యాంకర్ గా చేసింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు ఈమెకి ఎక్కువ పడే అవకాశం ఉంది. అదీ గాక హౌస్ లో ఎంటర్ టైన్ మెంట్ అందించే విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది.


ఇక చివరగా బాబా భాస్కర్, బాబా భాస్కర్ కేవలం రెండు వారాలు ఉంటాననుకుని మాత్రమే వచ్చాడట. అయినా ఇన్ని రోజులు ఉండగలిగాడంటే కారణం ఆయన పండించే వినోదమే. ప్రతీ టాస్క్ లో ఆయన చేసే కామెడీనే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. బాబా భాస్కర్ టైటిల్ గెలవడానికి ఆయనకి ఉన్న బలం జనాలని ఎంటర్ టైన్ చేయడమే.



మరింత సమాచారం తెలుసుకోండి: