మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన
వరుణ్ తేజ్ తన వరుస
బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. తాజాగా వచ్చిన అతని 'గద్దలకొండ గణేష్'
సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ క్రేజ్
హీరో కొత్త దర్శకుడైన
కిరణ్ కొర్రపాటి రాబోయే సినిమాలో నటిస్తున్నాడు. అతడు ఈ సినిమాలో ఒక బాక్సర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
అందుకే తన పాత్రకి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దెశంతో బాక్సింగ్ బాగా నేర్చుకోవాలనుకుంటున్నానని ఒక ఆంగ్ల పత్రికతో చెప్పారు. ఇందుకుగాను తాను ప్రముఖ
అంతర్జాతీయ బాక్సింగ్ ట్రైనర్లు వద్ద శిక్షణ తీసుకోబోతున్నాని అలానే బరువు కూడా తగ్గుతున్నానని వెల్లడించారు.
తాజాగా
వరుణ్ తేజ్ ఇంకో పత్రిక తో మాట్లాడారు.... "చాలా తొందర్లోనే నా బాక్సింగ్ ట్రైనింగ్ ని మొదలుపెడతా. బరువు తగ్గడానికి ముంబైకి చెందిన ఒక ట్రైనర్ తో వర్క్ చేస్తున్న. నా బాక్సింగ్ ట్రైనర్ లాస్ ఏంజెల్స్ నుంచి వస్తున్నారు. ఇప్పటివరకు నేను చాలా పాత్రలలో నటించాను కానీ మొట్ట మొదటి సారిగా ఈ పాత్ర కోసం నేను ఫిజికల్ గా మారాల్సివస్తుంది." అని ఆ పత్రిక ద్వారా తెలిపారు.
విచిత్రమేమిటంటే గద్దలకొండ గణేష్ లో
వరుణ్ నెగటివ్ రోల్ చేసాడు మళ్ళీ ఇపుడేమో చాలెంజింగ్ గా ఉండే బాక్సర్ రోల్ తో ప్రయోగాలు చేస్తున్నాడు. దీన్ని బట్టి ఈ ఫిదా
హీరో తనకి చాలెంజింగ్ గా అనిపించే పాత్రల కోసం వెతుకుతున్నాడని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో ఇక
వరుణ్ విషయాన్నీ పక్కన పెడితే, కీరా అద్వానీ
హీరోయిన్ గా చేస్తుందని సమాచారం. ఈ సినీ బృందం ఆమెను కలిసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే ఇది తన మూడవ తెలుగు
సినిమా అవుతుంది.