సినిమాల్లో టాప్ హీరో కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్లి పోతాడు అని అంతా అనుకున్నారు కానీ 2019 ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడు అనే వార్తలు ఊపందుకున్నాయి. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ అమితాబచ్చన్ పాత్రలో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారని... వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు అందరూ స్పందించారు తప్ప ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో పింక్ రీమేక్ తెరకెక్కబోతుంది అని ఇప్పటికీ తెలిసిన విషయమే. వచ్చే సంవత్సరం జనవరి నుండి ఈ మూవీ పట్టా లెక్క పోతుందని సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ గురించి ఓ చిన్న విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది డబ్బు రూపంలో కాదని షేర్స్ రూపంలో 50 కోట్ల రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారట.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా కోసం కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట. దీంతో షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన 25 రోజుల సమయంలోనే పింక్ రీమేక్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇక ఈ సినిమా బడ్జెట్ లో 75% పవన్ రెమ్యునరేషన్ ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ కూడా ఉండదట. పవన్ ఇమేజ్ రీత్యా కొన్ని మార్పులు చేసి ఒక హీరోయిన్ మాత్రమే తీసుకున్నప్పటికీ ఆ హీరోయిన్ కూడా ఒక పాటకే పరిమితం అవుతుందట. ఇక ఈ సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించబడుతుంది అని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి