సరిలేరు నీకెవ్వరూ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోంది. సినిమా విషయంలో దూసుకుపోతున్నది. జనవరి 11 న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. అక్కడితో ఆగకుండా రూ. 150 కోట్ల వైపు పరుగులు తీస్తున్నది. ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా అంతా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తుండటంతో సినిమా మంచి విజయం అందుకున్నది. హీరోలు పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉన్నది ఈ సినిమా.
మొదటిరోజే ఈ సినిమా రూ. 46.77 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. మిగతా రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తున్నది. బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సెలవులు ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయి. వీకెండ్ పూర్తయ్యే సరికి సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అంటున్నారు. అయితే, 2020 సంక్రాంతి మాత్రం సినిమా ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చింది.
70శాతానికి పైగా సక్సెస్ లో ఉన్నది. ఈ నెల మొదట్లో రిలీజైన చిన్న చితకా సినిమాలు పెద్దగా సందడి చేయలేకపోయినా, జనవరి 9 నుంచి అసలైన మజా మొదలైంది. రజినీకాంత్ దర్బార్ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజై మొదటి హిట్ అందుకుంది. ఈ సినిమాభారీ విజయం సాధించడంతో వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్నది. ఆ తరువాత వచ్చిన సరిలేరు నీకెవ్వరూ కూడా హిట్ మార్క్ ను అందుకోగా, జనవరి 12 న సందడి చేసిన అల వైకుంఠపురంలో సినిమా కూడా మంచి విజయం దక్కించుకుంది.
ఇలా వరసగా మూడు సినిమాలు హిట్ కావడంతో సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. అయితే, జనవరి 15 న వచ్చిన కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమా మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా బాగానే ఉండనే టాక్ వచ్చినా, మరీ నిదానంగా సాగడంతో సీరియల్ ను తలిపించే విధంగా ఉన్నది. టేకింగ్ విషయంలో తప్పుపట్టలేం. కానీ, సినిమా సీన్స్ రన్నింగ్ విషయంలోనే నిదానంగా ఉండటం విశేషం.