టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత జగపతి బాబు హీరోగా ఆయన తీసిన బాచి పెద్దగా అడనప్పటికీ, అక్కడి నుండి రవితేజ హీరోగా ఆయన తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అలానే నాగార్జున హీరోగా తెరకెక్కిన శివమణి సినిమాలు మంచి సక్సెస్ ని అందుకుని దర్శకుడిగా పూరి కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చాయి అనే చెప్పాలి. అనంతరం ఆంధ్రావాలా, 143, సూపర్ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న పూరి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2006లో తెరకెక్కించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించారు. 

 

అనంతరం బన్నీతో దేశ ముదురు, రామ్ చరణ్ తో చిరుత, తో మంచి హిట్స్ అందుకున్న పూరి, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ చవిచూశారు. ఆపై మరొక్కసారి మహేష్ బాబు తో ఆయన తీసిన బిజినెస్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత నుండి వరుసగా దారుణమైన పరాజయాలు అందుకుంటూ ముందుకు సాగిన పూరి కెరీర్ కి ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్ కొట్టి మళ్ళి పూర్వ వైభవాన్ని అందించింది. ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న పూరి పై కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇప్పటికే మీరు ఇటీవల వరుసగా పరాజయాలతో సతమతం అయ్యారు, వెంటనే ఒక హిట్ దక్కగానే ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న ఫైటర్ కు ఇంత భారీ రేంజ్ లో నీళ్ల వలె డబ్బు ఖర్చు చేస్తున్నారు జాగ్రత్త బాసు, ఏ మాత్రం తేడాకొట్టినా అంతేసంగతులు అంటున్నారు. అయితే ఈ సినిమా కథ, కథనాలు కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయని, కథ డిమాండ్ మేరకే అంత భారీ ఖర్చు పెడుతున్నట్లు టాక్. మరి పూరి ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ అందుకుంటాడో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: