ఒకప్పుడు సినిమాల్లో అయితే చెంప మీద ముద్దు పెడితే చాలు అదే దీంతో పెద్ద రొమాన్స్ గా ఫీలయ్యే వారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం... ప్రతి సినిమాలో లిప్ లాక్ ఉండాల్సిందే. లిప్ లాక్ లేకపోతే సినిమా చూసే ప్రేక్షకులు అందరూ ఏదో మిస్ అయింది అని ఫీల్ అవుతూ ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంత ముఖ్యమో ఆ కెమిస్ట్రీలో లిప్ లాక్  ఉండడం కూడా అంతే ముఖ్యం అంటుంటారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకులు కోరుకున్నదే కదా  దర్శకులు హీరో హీరోయిన్స్ కూడా చేయాల్సింది. అందుకే అందరూ లిప్ లాక్  లకు కూడా సై అంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా లిప్ లాక్ మాత్రం కామన్ గా ఉండిపోతున్నాయి. ఇక చిన్న హీరోల సినిమాల్లో అయితే అబ్బో అవి లిప్ లాక్ లు  అనడం కంటే అంతకుమించి అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 ఇలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి కూడా లిప్ లాక్ సాంప్రదాయం వచ్చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ కి మించి పోయింది టాలీవుడ్. అయితే ఇప్పుడు చాలా సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చూసే ఉంటారు. కానీ 24 గంటల లిప్ లాక్ సీన్లు చూసి ఉంటారా. టాలీవుడ్ లో యువ  హీరో అయిన నితిన్ కు మాత్రమే 24 గంటల లిప్ లాక్  సాధ్యమైంది అని చెప్పాలి. అయితే 24 గంటల లిప్ కిస్ ఎలా సాధ్యం అంటారా... మరి అంత ఆశ్చర్యపోకండి.. అది నిజ జీవితంలో కాదు సినిమాలో. నితిన్ హీరోగా హార్ట్ ఎటాక్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్ గా నటించింది. 

 

 

 ఇక ఈ సినిమాలో నితిన్ ఆదాశర్మ ను  ఒక డీప్ లిప్ లాక్ కావాలి అని చాలాసార్లు అడిగి విసిగిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఓ ఫైట్ తర్వాత అక్కడికి చేరుకున్న ఆదా శర్మ లిప్ లాక్ ఇచ్చేందుకు అంగీకరిస్తోంది. ఇక ఆ తర్వాత వీరిద్దరు ఒక క్లాత్ కప్పుకొని లిప్ లాక్  చేసుకుంటారు. ఇక  పక్కన టైం పరుగెడుతూ ఉంటుంది. ఏకంగా 24 గంటల పాటు ఈ టైం పరుగెడుతుంటే వీరిద్దరూ లిప్ లాక్ మూడ్  లోనే ఉంటారు. అంటే ఈ సినిమాలో ఏకంగా వీరిద్దరూ 24 గంటలపాటు లిప్ లాక్ చేశారు అన్న మాట. ఇక ఆ తర్వాత ఇలాంటి సీన్ మాత్రం ఏ దర్శకుడు తెరకెక్కించ లేదు. దీంతో ఇలా 24 గంటల లిప్ లాక్ సీన్ ఒక నితిన్ కే సాధ్యం అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: