సినీ పరిశ్రమలో సక్సెస్ వైపే ఏదైనా పరుగులు తీస్తుందీ అంటారు.  సక్సెస్ ఉన్నవారే పరిశ్రమలో ముందడుగు వేస్తూ వస్తారని అంటారు.  ఒకప్పుడు టాలెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.. సక్సెస్.. ఫెయిల్యూర్స్ అనేవాటి తో అస్సలు సంబంధం ఉండేది కాదు.  కానీ ఇప్పుడు మాత్రం వరుసగా రెండు మూడు సినిమాలు ఫెయిల్ అంటే హీరో కానీ, హీరోయిన్ కానీ.. దర్శకుడు కానీ ఫెయిల్యూర్స్ కిందే పడిపోతున్నారు.  అలాంటి వారికి అవకాశాలు కూడా తక్కువ వస్తున్నాయి.. కొన్ని సార్లు రాకపోవొచ్చు.  స్టార్ హోదాలో ఉన్నవారికి సైతం ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం కెరీర్ కష్టమే అంటున్నారు.  తాజాగా రన్ రాజా రన్ తో మంచి విజయం అందుకున్న శర్వానంద్ మొదట చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. 

 

తర్వాత హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  శతమానం భవతి లాంటి ఫ్యామిలీ తరహా సినిమాలో నటించి షెభాష్ అనిపించుకున్నాడు. ఎలాంటి హీరోకైనా తన కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం.. అయితే ఇప్పుడు శర్వానంద్ కి సైతం వరుస డిజాస్టర్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయి.  ‘పడి పడి లేచే మనసు'.. 'రణరంగం'.. 'జాను' సినిమాలతో శర్వాకు ఒకదానిని మించి మరొకటి ఫ్లాపు తగిలింది. దీంతో శర్వా తన కెరీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడట.

 

సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతలతో ఉన్న స్నేహం కారణంగా చేయాల్సి వచ్చిందని.. స్క్రిప్ట్ పై కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లానని అదే తన ఫెయిల్యూర్స్ కి ప్రధాన కారణం అయి ఉంటుందని అందుకే ఈసారి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని.. అంతా ఓకే అని నిర్ణయం తర్వాత ముందుకు వెళ్తానని అన్నారు.  అంతే కాకుండా కథల విషయంలో జడ్జిమెంట్ తనే స్వయంగా తీసుకోవాలని ఇతరుల సలహాలు తీసుకోకూడదని కూడా డిసైడ్ అయ్యాడట.  కామెడీ కంటెంట్ ఉండే స్క్రిప్టులకే ప్రస్తుతం శర్వా ప్రాధాన్యతనిస్తున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: