‘చెప్పను బ్రదర్’ వ్యవహారం తరువాత బన్నీ విషయంలో మార్పులు  వచ్చినప్పటికీ ఇప్పటికీ పవన్ అభిమానులు అల్లు అర్జున్ అంటే కొద్దిగా ఇంకా కోపంగానే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో బన్నీ కొడుకు అయాన్ ఫోటో పై బన్నీ అభిమానులు చేస్తున్న ప్రశంసలు పవన్ అభిమానులకు కొద్దిగా అసౌకర్యంగా మారుతున్నాయి. ఇక వివరాలలోకి వెళితే బన్నీ కొడుకు అల్లు అయాన్ స్కూల్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఒక ఫోటోను లేటెస్ట్ గా బన్నీ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసాడు. 

 

అంతేకాదు తన కొడుకు  విషయంలో గర్వపడుతున్నానంటూ ఓ పెద్ద పోస్ట్ కూడ పెట్టాడు. ఆ పోస్ట్ బన్నీ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. అయాన్ తను చదివే ప్రీ స్కూల్ లో రకరకాల యాక్టివిటీస్ లో ది బెస్ట్ గా నిలుస్తున్నాడట. మాదాపూర్ లోని బోధి వ్యాలీ స్కూల్ లో అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. ఆ స్కూల్ లో ప్రీ స్కూల్ సెలబ్రేషన్ కు ఈమధ్య బన్నీ వెళ్ళడం జరిగింది. 

 

ఆ ఫంక్షన్ లో బాగా యాక్టివ్ గా పాల్గొన్న తన కొడుకును చూసి బన్నీ పులకరించిపోతు కొన్ని కామెంట్స్ చేసాడు. వైట్ షర్ట్ విత్ బ్లూ కలర్ సూట్ బ్లూ కలర్ ప్యాంట్ తో మెరిసిపోతున్న ఫోటోని షేర్ చేస్తూ ‘స్కూల్లో బాగా రాణించినందుకు అయాన్ నీ విషయంలో చాలా గర్వపడుతున్నా. మా అబ్బాయి లైఫ్ పునాదికి సంబంధించిన మంచి విషయాలను నేర్పిస్తున్న బోధి వ్యాలీ స్కూల్ టీచర్లకి నా ధన్యవాదాలు. ఈ స్కూల్ లో చేర్పించడం తల్లిదండ్రులుగా ఆనందపడుతున్నాం. ఇది నేను గర్వపడే రోజు’ అంటూ బన్నీ కామెంట్ చేసాడు. 


ఈ ఫోటో బన్నీ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో అయాన్ ఫోటోని చూసి ఇక సినిమా ఎంట్రీకి అయాన్ కు రంగం సిద్ధమైనట్లే అని కామెంట్ చేస్తూ బన్ని 2.0 గా అయాన్ తెరంగేట్రం చేస్తాడు అంటూ ఊహాగానాలు మొదలుపెట్టేసారు. అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న సినిమాలో యాన్ నటిస్తే బాగుండును అంటూ సలహాలు కూడ ఇస్తున్నారు. ఇప్పుడు ఈకామెంట్స్ పవన్ అభిమానుల వరకు వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ కూడ తన పిల్లల విషయంలో ఇలా పట్టించుకుంటే ఎంత బాగుంటుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అకిరా నందన్ రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఒక సినిమాలో నటించినా ఆద్య తన స్కూల్ ఫంక్షన్స్ లో క్లాసికల్ డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నా ఏనాడు పవన్ తన పిల్లల గురించి ఒక్క మాట కూడ మాట్లాడక పోవడం పవన్ అభిమానులు ఇప్పటికీ లోటుగానే భావిస్తూ ఉంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: