తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది.  అదిరే అభి టీమ్ తో పరిచయం అయిన హైపర్ ఆది అతి తక్కువ కాలంలోనే ఓ టీమ్ లీడర్ గా ఎదిగాడు.  ఆయన టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు మరికొంత మంది కమెడియన్లు ఉన్నారు.  ప్రతివారం హైపర్ ఆది ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటారు. ఆయన స్కిట్ లో కామెడీ పంచ్ లు చూస్తే ఎవరికైనా నవ్వు రావడం ఖాయం.  అలాంటి హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  'అదిరింది' కామెడీ షోలో ఓ కమెడియన్ రేటింగ్ .. హైపర్ ఆది రేటింగ్ కంటే ఎక్కువగా ఉందనే ప్రచారాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది.

 

ఈ విషయంపై స్పందించిన హైపర్ ఆది నవ్వుతూ... ఈ మాట మీతో ఎవరన్నారోగానీ .. భ్రమలు వేరు .. నిజాలు వేరు అని గ్రహించాలి. హైపర్ ఆదితో పోల్చుకోవాలన్నా .. బీట్ చేయాలన్నా దానికి కొన్ని లెక్కలు వున్నాయి. 'జబర్దస్త్'లో ఇంతవరకూ 130 స్కిట్లవరకూ చేశాను. వాటిలో 10 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్లు 40వరకూ వున్నాయి. 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన స్కిట్లు 5 వున్నాయి. 30 మిలియన్ వ్యూస్ పైగా వచ్చిన స్కిట్లు 2 వున్నాయి. 58 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్ 1 వుంది.  

 

ఇవన్నీ నేను సోషల్ మీడియాలో అయితే సృష్టించలేదు కదా.. కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.  నేను ఎవరికీ కాంపిటీషన్ కాదు.. కాని నన్ను కించపరిచే విధంగా మాట్లాడితే కౌంటర్ ఇవ్వక తప్పదు అన్నాడు. ఒకవేళ మీతో అన్న ఆ వ్యక్తి  హైపర్ ఆదిని దాటాలంటే .. ఇవన్నీ దాటుకుంటూ రావాలి" అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: