తెలుగులో బాలీవుడ్ హీరోయిన్స్ సందడి ఎక్కువవుతోంది. గతం నుంచి ఈ హడావిడి ఉన్నా.. ఆ మధ్య కాస్త తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి మరీ.. హిందీ భామలను తీసుకువస్తున్నారు. 

 

ఆలియాభట్.. అనన్యపాండే.. సయూ మంజ్రేకర్.. దిశాపటాని. ఈ పేర్లు మనకు కొత్తే అయినా.. హిందీలో మాత్రం పాపులరే. తెలుగు సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా వైపు అడుగువేయడంతో.. బాలీవుడ్ మార్కెట్ కవర్ చేసేందుకు హిందీ భామలను ప్రిపేర్ చేస్తున్నారు. తెలుగు సినిమాల మార్కెట్ పెరగడంతో మన హీరోలతో నటించేందుకు వాళ్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. 

 

బాలీవుడ్ పెర్ఫామెన్స్ బ్యూటీ అలియాభట్ ట్రిపుల్ ఆర్ తో తెలుగులోకి అడుగుపెడుతోంది. బాహుబలి చూసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తి కనుబరిచింది. సిినిమాలో రామ్ చరణ్ అల్లూరి సితారామరాజుగా నటిస్తుంటే.. ఆయన భార్యగా అలియా కనిపించనుంది. 

 

బాలీవుడ్ క్యూట్ అండ్ గ్లామర్ హీరోయిన్ అనన్యపాండే విజయ్ దేవరకొండతో జోడీ కడుతోంది. పూరీ స్పీయ దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ప్రముఖ హిందీ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య గతేడాది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ ఓ మూవీలో నటించగా.. ప్రస్తుతం కాలా పీలి అనే మరో హిందీ మూవీ చేస్తోంది. 

 

విజయ్, పూరీ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతోంది. కొత్త హీరోయిన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేయడంలో ఎక్కువ అనుభవం ఉన్న పూరీ.. హీందీ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ భామ అనన్యను ఎంచుకున్నాడు. 

 

తెలుగులో హిందీ భామల సందడి ఎక్కువైంది. కియారా ఆద్వానీ.. పూజా హెగ్డేకు హిందీలో దక్కని స్టార్ డమ్ ఇక్కడ సొంతం చేసుకున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది పూజానే. ప్రస్తుతం తెలుగు సినిమాను ముంబయి హీరోయిన్ ఏలడంతో.. బాలీవుడ్ హీరోయిన్స్ దృష్టి టాలీవుడ్ పై పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: