మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ రీ సౌండ్ వచ్చేలా చేసింది. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులు అన్ని పక్కకు తప్పుకునేలా చేసింది. నాన్ బాహుబలి రికార్డుల్లో నేనే రారాజుని అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్. చిట్టిబాబు చెవిటితనాన్ని బాగా వాడుకున్న సుకుమార్ తను సినిమా హిట్టు కొడితే ఎలా ఉంటుందో చెప్పిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో చరణ్ మాస్ అవతార్ మాస్ ఆడియెన్స్ కు పండుగ చేసుకునేలా చేసింది. 

 

రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించిన సినిమా అంటే రంగస్థలం మొదటిస్థానంలో ఉంటుంది. చెవిటి వానిగా చరణ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒక వ్యక్తి చేతిలో ఉన్న రంగస్థలం ఊరిని అన్నదమ్ములు కలిసి తీసుకొచ్చిన మార్పుని 80వ కాలంలోకి వెళ్లి చెప్పిన సుకుమార్, ఆ సినిమాలో తన ప్రతిభ ఏంటి అన్నది చూపించాడు. మాస్ సినిమా అంటే ఫైట్లు, ఛేజింగ్ సీన్స్ మాత్రమే కాదు రంగస్థలం లాంటి క్లాస్ మూవీస్ కూడా వస్తాయి. రంగస్థలం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమా. 

 

అందుకే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. హీరో చిట్టి బాబు మాస్, హీరోయిన్ రామ లక్ష్మి మాస్, సినిమాలో ఓ ఊపు ఊపిన రంగమ్మత్త మాస్ ఆడియెన్స్ ను అలరించింది. ఇన్ని మాస్ అటెంప్ట్ లతో సుక్కు చేసిన క్లాస్ మూవీ రంగస్థలం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమాలు కూడా ఊర మాస్ సినిమాగా వచ్చింది. కాకపొతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: