తేజస్వి మాదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, హార్ట్ అటాక్ వంటి చిత్రాల్లో హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో ఒక ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించిన తేజస్వి మాదివాడ ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజస్వి మాదివాడ చాలా హాట్ గా కనిపించింది. అప్పటి వరకూ చాలా గ్లామర్ పాత్రల్లో కనిపించని తేజస్విని అలా చూసినవారందరూ షాక్ అయ్యారు.

IHG'Committed' In Bikini | Gulte - Latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> ...

అయితే హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా ఆమెకి సరైన గుర్తింపు దక్కలేదు. తెలుగమ్మాయి అయిన తేజస్వికి సాధారణంగానే అవకాశాలు అంతగా రాలేదు. సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయినా బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వచ్చి చాలా పాపులర్ అయింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సీజన్ ద్వారా అభిమానులని సంపాదించుకుంది. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటున్న తేజస్వి, హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

 

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటూ, హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటున్న తేజస్వి తాజాగా కమిట్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకి ఎదురయ్యే సమస్యల ఇతివృత్తంగా వస్తున్న ఈ చిత్రం నుండి తేజస్వి బర్త్ డే సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో తేజస్వి బోల్డ్ లుక్ లో చాలా హాట్ గా కనిపించింది.

 

ఫుట్ లూస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తేజస్వికి హిట్ అందిస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: