టాలీవడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, తాతమ్మ కల సినిమాతో నటుడిగా తెలుగు చలన చిత్ర రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, ఆ తరువాత నుండి హీరోగా వరుస అవకాశాలతో ముందుకు సాగారు. తన అద్భుతమైన నటనతో కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు అందుకున్న బాలయ్య, ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. తాము ఆర్ధికంగా ఎంతో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎన్టీఆర్, తామందరినీ జీవితంలో కష్టపడమని చెప్పేవారని, ధనం ఉందన్న అహం విడిచి అందరం సామాన్య మానవులుగా బ్రతుకుతూ, మనకు వీలైనంతలో తోటి వారిని బ్రతికిస్తూ జీవించాలని ఎప్పుడూ చెప్పేవారని బాలయ్య పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు.
ఇక తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే బాలయ్య, మొదటినుండి తనకు వీలైనంతలో పలు సామజిక, సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. గత కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు మన దేశాన్ని కూడా ఇటీవల మూడు నెలలుగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తమ బసవతారకం హాస్పిటల్ తరపున పలువురు రోగులకు రోజువారీ సరుకులు, ఇతరత్రా సామాగ్రి పంపిణీ చేసిన బాలకృష్ణ, ఇటీవల కరోనా నిరోధానికి పలువురు సినీ పరిశ్రమ వారికి ఉచితంగా మందులు పంపడం జరిగింది. 'ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ ను బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారందరికీ పంపిస్తున్నారు.
అలానే నన్ను కూడా గుర్తుపెట్టుకుని మరీ మెడిసిన్ పంపినందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు', అంటూ కాసేపటి క్రితం టాలీవుడ్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఒక ప్రకటన రిలీజ్ చేసారు. కాగా గతంలో బాలయ్య, వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమ బసవతారకం ఆసుపత్రి తరపున కరోనా మహమ్మారి నిరోధానికి బాలయ్య చేస్తున్న ఈ గొప్ప పనికి టాలీవుడ్ కు చెందిన పలువురు పలువురు ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు, ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి