ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే ఫన్‌డే ఎలాగో… మండే అందరి ఒళ్లు ‘మండే’ అలాగే. నామినేషన్ల రోజు కాబట్టి ఇంటి సభ్యులు హాట్‌ హాట్‌గా ఉంటారు. అయితే ఈ వారం నామినేషన్ల వేడి మామూలుగా కనిపించండం లేదు. దానికి తోడు బిగ్‌బాస్‌ కూడా దానికి కాస్త మిర్చీ ఫ్లేవర్‌ యాడ్‌ చేశారు. ఎండు మిర్చి దండలు మెడలో వేసి నామినేట్‌ చేసి, కారణాలు చెప్పమన్నారు. మరి ఈ వారం ఎవరిని ఎవరు నామినేట్‌ చేశారో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు చూడాలి. అయితే ప్రోమో ప్రకారం ఈ రోజు మెహబూబ్‌ టాప్‌ నామినేటడ్‌ పర్సన్ లా కనిపిస్తోంది. మొత్తంగా ఐదుగురు నామినేట్‌ చేసినట్లున్నారు. అందుకే అతని కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి.

హారికకు రెండు, మూడు మిర్చి దండలు వేస్తా అంటూ కుమార్‌ సాయి నామినేట్‌ చేశాడు. అంతగా ఆమెను ఎందుకు టార్గెట్‌ చేశారో చూడాలి. కాలు నొప్పి అంటూ కుంటి సాకులు చెబుతున్నాడంటూ నోయల్‌ను దివి నామినేట్‌ చేసినట్లుంది. సింపతీ కోసం ఇదంతా చేస్తున్నట్లుగా ఉంది.. ఫేక్‌ అనిపిస్తున్నారు అని కూడా చెప్పింది. నేను నచ్చకపోతే నా గురించి మాట్లాడొద్దు అని మోనాల్‌ అంది. దానికి అభిజీత్‌ మెచ్చుకోవడమూ కనిపించింది. కెప్టెన్సీ టాస్క్‌ సమయంలో సంచాలకుడిగా నువ్వు విఫలమయ్యావని అఖిల్‌ అభిజీత్‌ను నామినేట్‌ చేశాడు. ఆటోమేటిగ్గా అభిజీత్‌… అఖిల్‌ను నామినేట్‌ చేశాడు.

ఈసారి ఇంట్లో కొత్త గొడవులు కనిపిస్తున్నాయి. మెహబూబ్‌, ఆరియానా మధ్య డిస్కషన్‌ జరిగింది. మీ పేరు ఎత్తితే నామినేట్‌ చేసేస్తున్నారు అంటూ ఆరియానా అంటోంది. మరోవైపు కుమార్‌సాయి, సోహైల్‌ మధ్య కూడా అదే పరిస్థితి. వేలు చూపించి మాట్లాడొద్దు అంటూ సోహైల్‌ అంటే.. యాటిట్యూడ్‌ వద్దని కుమార్‌సాయి అంటున్నాడు. చూద్దాం ఈ ఘాటు నామినేషన్‌లో ఇంకేం జరిగాయో.

కాగా శనివారం ఎపిసోడ్ లో అనారోగ్య సమస్యల కారణంగా గంగవ్వ బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోగా ఆదివారం ఎపిసోడ్ లో నామినేషన్ లో వున్న జోర్దార్ సుజాత ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: