తెలుగు చలన పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్ గా ఎదిగిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గురించి తెలుగు వారు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రపంచం నలుమూలలా తెలుగు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అన్న గారి పేరు ఒకసారి వినిపిస్తే చాలు అందరి మనసులు పులకరించే పోతాయి అని చెప్పక తప్పదు. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా ఏకచ్ఛత్రాధిపత్యం తో దూసుకెళ్లిన ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో జానపద, పౌరాణిక పాత్రలు చేయడంలో దిట్ట అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మాయాబజార్ మొదలుకొని దానవీరశూరకర్ణ, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశ, రాజకోట రహస్యం, నర్తనశాల, గండికోట రహస్యం సహా మరెన్నో జానపద మరియు పౌరాణిక సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో అటువంటి పాత్రలు చేయగల నటుడు ఎవరు అంటే ఎక్కువగా వినిపించే పేరు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. మొదటగా తాతమ్మకల సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అప్పట్లోనే అక్బర్ సలీమ్ అనార్కలి సినిమాలో సలీం పాత్రలో తనదైన నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన బాలకృష్ణ మధ్యలో శ్రీకృష్ణార్జున విజయం, భైరవద్వీపం, ఆదిత్య369, శ్రీరామరాజ్యం, పాండురంగడు వంటి సినిమాల్లో పలు పౌరాణిక, జానపద పాత్రల్లో నటించి ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

ఆ విధంగా తండ్రి తర్వాత జానపద, పౌరాణికాలు చేయడంలో కింగ్ గా గొప్ప పేరు దక్కించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక కొన్నేళ్లక్రితం సౌందర్య ద్రౌపదిగా ఆయన అర్జునుడిగా తెరకెక్కించిన నర్తనశాలకు సంబంధించి చిత్రీకరించిన 17 నిమిషాల సినిమా ఇటీవల ఓటిటి లో రిలీజ్ అయి మంచి పేరు దక్కించుకుంది. అన్నీ కలిసి వస్తే  పలువురు ఇతర నటులతో భవిష్యత్తులో దాని పూర్తి సినిమాని తీసే అవకాశం కూడా లేకపోలేదని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా బాలకృష్ణ ఇటీవల చెప్పారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: