మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా రౌద్రం రణం రుధిరం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

టాలీవుడ్ తో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన కొందరు దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ హీరోగా తన తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల రికార్డులను అధిగమించి భారీ స్థాయిలో సరికొత్త రికార్డును నెలకొల్పే విధంగా ఈ సినిమాని దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి వండర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే విజువల్స్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన వాయిస్ ఓవర్ తో మెగా ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ ని అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ టీజర్. ఇకపోతే ఈ టీజర్ నేటితో ఏకంగా 33.3 మిలియన్ వ్యూస్ ని అందుకని యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న తొలి తెలుగు టీజర్ గా సరికొత్త రికార్డును సృష్టించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు పేరిట ఉన్న రికార్డును ఈ ఆర్ఆర్ఆర్ రామరాజు టీజర్ బద్దలు కొట్టింది అని రాబోయే రోజుల్లో ఇది మరెన్ని రికార్డులని బద్దలు కొడుతుందో చూడాలని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధం తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుంది మూవీ యూనిట్. మరి ప్రస్తుతం మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తిని పెంచిన ఈ సినిమా, రేపు రిలీజ్ తర్వాత ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: