టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న వారు సమంత అక్కినేని. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకోవడం తోపాటు హీరోయిన్ గా తన అందం అభినయంతో ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నారు.

ఇక ఆ తర్వాత నుంచి వరుసగా పలు అవకాశాలు అందుకుని కొనసాగిన సమంత అనతికాలంలోనే టాలీవుడ్లోని స్టార్ నటీమణుల్లో ఒకరుగా నిలిచారు. ఇక ఆమె కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఉన్నాయి. ఒకరకంగా టాలీవుడ్ లో సమంత ని గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని కూడా అంటుంటారు. ఆవిధంగా తనదైన శైలిలో మంచి సినిమా అవకాశాలు అందుకుని కొనసాగిన సమంత మూడేళ్ల క్రితం నాగచైతన్య వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని కోడలిగా కొనసాగుతూ అటు సినిమాలతో పాటు ఇటు పలు కమర్షియల్ యాడ్స్ అలానే షోల్లో కూడా నటిస్తూ కొనసాగుతున్న సమంత పై ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వర్ధమాన నటి శ్రీరెడ్డి కొంత సంచలనంగా కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం సమంత బికినీ ధరించి దిగిన ఫోటోల పై శ్రీ రెడ్డి కామెంట్స్ చేస్తూ పెళ్లయిన తర్వాత ఇటువంటి దుస్తులు ధరించడం సరైనది కాదు నమ్రత, అమల లాంటి వారిని చూసి నేర్చుకోండి, వారు ఎంత పద్ధతిగా దుస్తులు వేసుకుని తమ కుటుంబ విలువలకు కాపాడుతున్నారో అంటూ ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది.

అయితే దానిపై పలువురు సమంత అభిమానులు కొంత ఆగ్రహంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో శ్రీ రెడ్డి పై కామెంట్ చేస్తున్నారు. మొదటి నుంచే సమంత ఎంతో సౌమ్యమైన స్వభావం గల అమ్మాయి అని, అలానే తన పని తాను చూసుకోవడమే తప్ప ఇతరుల విషయాల్లో అలానే వ్యవహారాల్లో తలదూర్చే అలవాటు లేని సమంతకి ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ వేర్ తో పాటు ట్రెండీ వేర్ కూడా ధరించే అలవాటు ఉందని అయినా ఎవరి వ్యక్తిగత వ్యవహారం వారిదని, అయితే వాటిని తప్పు పట్టి మనకు నచ్చినట్లు వ్యవహరించమని సలహా ఇవ్వటం సరైనది కాదని, ఇకపై ఈ విధంగా సమంత పై తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పలువురు ఆమె అభిమానులు శ్రీ రెడ్డికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: