పవన్ కళ్యాణ్ నటించే సినిమాలో ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా తన పాత్రను ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా నటిస్తారు. అంతేకాకుండా తన సినిమాలు ఎలాంటి పాయింట్స్ ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా దర్శక నిర్మాతలతో చర్చిస్తాడు. ఈ విధంగా తను నటించిన సినిమాలలో స్క్రీన్ ప్లే కూడా పవన్ కళ్యాణ్ రాసుకునేవారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తిరిగి తనలో ఉన్న రచయితను బయట పెట్టబోతున్నాడు.
వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్,రానా కలిసి నటిస్తున్నారన్న సంగతి మనకు ఇదివరకే తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దర్శక పర్యవేక్షకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ను పవన్ కళ్యాణ్ రచిస్తున్నట్లు సమాచారం. అందుకుగాను త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రచయితగా తనకున్న పవర్ ను మరోసారి చూపించబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రచయితగా మారడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా రచయితల పేర్లు పవన్ కళ్యాణ్ పేరు ఉంటుందో లేదో అనే ఆసక్తి నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి