ఎన్నో కష్టాలు దాటి సంక్రాంతికి విడుదల అవుతుంది అని భావిస్తున్న శంకర్ ‘ఐ’ సినిమాకు ఈసారి అనుకోని సమస్యలు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ కుటుంబం నుంచి వస్తున్నాట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ తాము కొనుగోలు చేసామని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ వాదిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాకేష్ రోషన్ అల్లుడికి హైపర్ బీస్ గ్రూప్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్లు కొనుగోలు చేసిందని రాకేష్ వాదన. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆస్కార్ ఫిల్మ్స్ నుంచి ’ఐ’ ఓవర్‌సీస్ రైట్స్‌ని B4U- హైపర్ బీస్ గ్రూప్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి అని రాకేష్ రోషన్ వివరణ ఇస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు అడ్వాన్స్‌గా ఐదు కోట్లను చెల్లించారని వీరి వాదన. అయితే మిగిలిన పేమెంట్‌ని డిసెంబర్ 12 లోగా అందేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారట.  కానీ, అనుకోకుండా ఆ రోజుకు ‘ఐ’ నిర్మాతలకు చెల్లించవలసిన సొమ్మును చెల్లించడంలో రాకేష్ రోషన్ అల్లుడు విఫలం కావడంతో ఈ సినిమాను ఆస్కార్ ఫిల్మ్స్ తామే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  దీనితో కోపం తెచ్చుకున్న రాకేష్ రోషన్ ఈ వ్యవహారం తేలకుండా ‘ఐ’ సినిమాను విడుదల చేస్తే ఆ సినిమా విడుదలను ఆపు చేయమని కోర్టుకు వెళతామని ఆస్కార్ ఫిలిమ్స్ కు నోటీసు ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు బయటకు రావడంతో అసలు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎవరి వద్ద ఉన్నాయో తెలియక బయ్యర్లు అయోమయంలో పడిపోతున్నట్లు టాక్. ఈ వ్యవహారం సక్రమంగా రాజీకి కుదరకపోతే మరోసారి ‘ఐ’ సినిమా విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: