ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గత సంవత్సరం అల్లు అర్జున్  ‘అల వైకుంఠపురములో’ సూపర్ స్టార్ మహేష్ బాబు  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల లాగానే  ఈ సంవత్సరం  మాస్ మహా రాజ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా కూడా వీక్ డేస్ లోనూ మంచి కలెక్షన్లను సాధిస్తుండడం  విశేషంగా చెప్పుకోవాలి. 13 వ రోజున కూడా ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల్లో 0.68 కోట్ల షేర్ ను రాబట్టి సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.

‘క్రాక్’ సినిమాకి  ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 రోజులకు గాను ఈ సినిమా  30.83 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం మరో విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 12కోట్ల పైనే లాభాలను దక్కించుకున్నారు.ఇక ఈ సినిమా ఇప్పుడు రవి తేజకి ఊర మాస్ హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: