ఇక క్రిష్ తీస్తున్న మూవీలో పవన్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నారని, నిజాం రాజుల కాలం నాటి కథగా ఈ సినిమా ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కుతున్నట్లు టాక్. మరోవైపు యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కొషియం తెలుగు రీమేక్ లో రానా తో కలిసి నటిస్తున్న పవర్ స్టార్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు.
అయితే వీటి తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. అయితే వీటిలో సురేందర్ రెడ్డి తీయబోయే సినిమా ని వన్ స్నేహితుడు అయిన రాం తాళ్లూరి తన ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆ మూవీని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఎంపిక చేసిందట యూనిట్. ఇటీవల ఈ యొక్క కథ, కథనాలు ఆమెకు వినిపించారట దర్శకుడు సురేందర్ రెడ్డి. అవి ఆమెకు ఎంతో నచ్చడంతో సాయి పల్లవి కూడా మూవీ ని వెంటనే ఓకె చేసిందని వినికిడి. మంచి కథ, అలనే తన పాత్ర కూడా ఎంతో బాగుండడంతోనే ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం తొలిసారిగా పవర్ స్టార్ కి జోడీగా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ని చోడవచ్చు ......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి