ప్రస్తుతం పచ్చి బూతు కంటెంట్ తో ఎన్నో తెలుగు సినిమాలు వస్తున్నాయి. నభూతో నా భవిష్యత్ అన్నట్టు దర్శక నిర్మాతలు బోల్డ్ కంటెంట్ సినిమాలను ప్రజలపై రుద్దుతున్నారు. అటువంటి సినిమాలకు కూడా సెన్సార్ లభించడం తో ప్రజలందరూ విస్తుపోవడం కామన్ అయిపోయింది. ఇటీవల విడుదలైన చావు కబురు చల్లగా టీజర్ లో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉండి ఏడుస్తున్న ఓ వివాహితకు సైట్ కొడతాడు హీరో. ఇటువంటి చెత్త సినిమాలు ప్రజలను ఏ విధంగా ప్రభావం చేస్తాయో చెప్పాలని నెటిజన్లు ఫైర్ కూడా అయ్యారు.


అది మరవకముందే మార్చి 11వ తేదీన 'ఏక్ మినీ కథ' మూవీ కి సంబంధించిన టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ లో డైలాగ్ బట్టి చూస్తుంటే ఇది కూడా బోల్డ్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తోంది. అది చిన్నదైతే ప్రాబ్లం పెద్దదే.. అనే డైలాగ్ ను హైలెట్ చేస్తూ సినిమా కథను మొత్తం ఆ పాయింట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. టైటిల్ లోగో పై స్కేల్ బొమ్మ కూడా హవ్వ, ఏంటిది అనేలా చేస్తోంది. చివరికి రహస్యంగాల గురించి కూడా సినిమాలు చేయడానికి తెలుగు సినిమా డైరెక్టర్ లు సిద్ధం కావడంతో ప్రేక్షకులు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే గీతాఆర్ట్స్-2 తరహాలో ఏక్ మినీ కథ సినిమా కోసం యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ పెట్టారు యూవీ నిర్మాతలు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం ఫేమ్ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ, రచనా సహకారం అందించారు. కాగా కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 3 భాషల్ని కలిపి పెట్టిన ఏక్ మినీ కథ టైటిల్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. టీజర్ కూడా పెద్ద దుమారమే రేపుతోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే పచ్చి బూతు కంటెంట్ తో ఈ సినిమా త్వరలోనే థియేటర్లకు రానుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: