ఒక హీరోతో కాని లేదా మరో దర్శకుడితో కాని ఒక హీరోయిన్ వరసగా సినిమాలు చేస్తూ ఉంటే వారిద్దరి మధ్యా ఎదో జరుగుతోంది అన్న ప్రచారం సర్వసాధారణం. దర్శకుడు రవిబాబుకు హీరోయిన్ పూర్ణకు మధ్య ఉన్న వ్యవహారం పై రవిబాబు ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. సినిమా జీవితానికి తన వ్యక్తిగత జీవితానికి మధ్య తాను చాల గ్యాప్ ను కొనసాగిస్తానని అందువల్లనే తనతో ఎఫైర్ పెట్టుకోవడానికి ఏ హీరోయిన్ ఆశక్తి చూపదు అంటూ కామెంట్స్ చేసాడు రవిబాబు.
తాను భూమికతో గతంలో మూడు సినిమాలు వరసగా చేసానని ఆ తరువాత పూర్ణతో వరసగా సినిమాలు చేస్తున్నంత మాత్రాన ఆమెతో తనకు ఎఫైర్ అంటూ వార్తలు రాస్తే ఎలా అంటూ మీడియా పై సెటైర్లు వేసాడు రవిబాబు. తాను ఏ హీరోయిన్ తో సినిమాను చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ తో తాను క్లోజ్ గా ఉంటానని ఆ సినిమా పూర్తి అయిన తరువాత ఆ హీరోయిన్ తో కనీసం ఫోన్ లో కూడ మాట్లాడను అని షాకింగ్ కామెంట్స్ చేసాడు రవిబాబు.
ఇదే సందర్భంలో పూర్ణ గురించి మాట్లాడుతూ ఆమెలా అతి సహజంగా నటించే హీరోయిన్స్ సినిమా రంగంలో చాల తక్కువ మంది ఉన్నారు అంటూ కామెంట్స్ చేసాడు. ‘అవును 2' అయితే ‘అవును 3’ నుకూడా నిర్మించే ఆలోచన తనకు ఉంది అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు రవిబాబు. పెద్ద సినిమా దర్శకులు ఎవ్వరూ తనకు అవకాశాలు ఇవ్వడం లేదని అంటూ తాను ఆ సినిమాల స్థాయి లో నటించ లేనని వారి అభిప్రాoయ కాబోలు అంటూ పెద్ద దర్శకుల పై సెటైర్లు వేస్తున్నాడు రవిబాబు..