ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ యొక్క వినియోగం మరింత ఎక్కువ అవడం, ముఖ్యంగా ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ చేతిలో ఉండడంతో ఏ న్యూస్ అయినా సరే కేవలం కొన్ని క్షణాల్లోనే అందరికీ యిట్టె చేరిపోతోంది. మరీ ముఖ్యంగా మీడియా సంస్థలు కూడా ఒకప్పటితో పోలిస్తే విరివిగా పెరగడం కూడా సమాచారం ఇంత వేగవంతంగా చేరడానికి కారణం. ఇక వాటితో పాటు సినిమాల యొక్క క్వాలిటీ ఖర్చులు వంటివి కూడా విపరీతంగా పెరిగాయి. అలానే హీరోల అభిమానుల మధ్య వార్స్ కూడా వాటితో పాటు మరింతగా పెరుగుతూ వస్తున్నాయి.
దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉండడం, ఎవరికి తోచిన విధంగా పలు సినిమాలు అలానే హీరో, హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేయడం పరిపాటి అయిపోయింది. దీనితో మా హీరో గురించి ఇలా అన్నారు, కాబట్టి మేము మీ హీరోని వదలం అంటూ సోషల్ మీడియాలో వార్స్ మరింతగా పెట్రేగిపోతున్నాయి. అయితే అసలు ఫ్యాన్స్ మధ్య వార్స్ అంటే ఇవి కాదని, ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, నటరత్న ఎన్టీఆర్ ల సినిమాల రిలీజ్ సమయంలో వారిద్దరి అభిమానుల మధ్యన వార్స్ మరోలా ఉండేవని అంటున్నారు కొందరు సీనియర్ విశ్లేషకులు.
అప్పట్లో థియేటర్స్ లోకి ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే దానికి పోటీగా కృష్ణ సినిమా ఉండవలసిందే అని, అలానే ఒకరికి పోటీగా మరొకరి అభిమానులు తమ సినిమాలను బాగా ప్రమోట్ చేసేవారని, చివరికి ఏ సినిమా విజేతగా నిలిచినా, లేదా రెండూ సక్సెస్ అయినా ప్రేక్షకాభిమానులు వాటికీ ఎంతో బ్రహ్మరథం పట్టేవారని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా నేటి కాలం మాదిరిగా ఒకరి హీరోపై మరొకరు విద్వేషాలు పెంచుకుంటూ రెచ్చగొట్టే విధంగా అస్సులు ప్రవర్తించేవారు కాదట, అదీకాక ఒకవేళ అవతలి హీరో సినిమా ఫెయిల్ అయితే దానిపై నెగటివ్ ప్రచారం కూడా పెద్దగా ఉండేది కాదట.
ఆ విధంగా అప్పటి కాలం హీరోలు వారి అభిమానులు ఉండేవారని, అయితే నేడు దానికి పూర్తి భిన్నంగా మా హీరోల సినిమాల పై పాజిటివ్ గా స్పందించడం, ప్రక్క హీరోలవి ఫెయిల్ అయితే వారిపై బురద జల్లడం వంటివి అస్సలు ఉండేది కాదని,దయచేసి ప్రస్తుతం ఉన్న హీరోలు వారి వారి అభిమానులకు సంయమనంతో మెలిగేలా నడుచుకునే విధానాన్ని నేర్పాలని, అలానే అభిమానులు కూడా హద్దులు దాటవద్దని పలువురు సినీ విశ్లేషకులు అభ్యర్థిస్తున్నారు.....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి