ఆ విధంగా రెండు సార్లు మహేష్ బాబు తో సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్ ఒక మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని మరొక మూవీతో పరాజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు అతి త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించిన త్రివిక్రమ్ ప్రస్తుతం తన టీంతో కలిసి దాని యొక్క స్క్రిప్టుపై గట్టిగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రస్తుతం ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా యువ మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. తెలుగు సహా పలు తమిళ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన జిబ్రాన్ అయితేనే ఈ స్టొరీ కి పక్కాగా న్యాయం చేయగలడని భావించిన త్రివిక్రమ్ తొలిసారిగా అతన్ని తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి