ఈ వారం బాలీవుడ్ వార్తలలో  బాగా వినపడిన పేరు కంగనా రనౌత్ .ఆమె హిందీలో  ఓ ఫైర్ బ్రాండ్ అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ వారం ట్విట్టర్ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది. ఆమె ఈ మధ్య ప్రభుత్వం మీద చేస్తున్న కామెంట్స్ తో ఆమె ని ట్విట్టర్ బ్లాక్ చేసింది.దీనికి ఆమె స్పందిస్తూ నా గొంతుని ఎవరు ఆపలేరు అన్నారు.


 ఇక బాలీవుడ్ లో బాగా వినిపించిన సినిమా మాత్రం సల్మాన్ ఖాన్ రాధే. ఈద్ రోజున అంటే మే 13న రాధే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటిటి లో కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించింది.అయితే ఓటిటి లో కూడా మనం టికెట్ కొన్నట్టు కొని సినిమాని చూడాలి అంట. ఈ పద్ధతిని ఇప్పటికే హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతిని సల్మాన్ ఖాన్ ఇండియాలోకి కూడా తెచ్చారు. ఈ విషయం మీద ప్రస్తుతం బాగా చర్చ జరుగుతుంది. ఒక పక్క రోజుకి లక్షల కేసులు వస్తుంటే సల్మాన్ థియేటర్స్ లో ఆయన సినిమాని విడుదల చేసుకోవడంపై అందరికి అసంతృప్తి ఉందని టాక్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ రాధే సినిమా గురించి చేతులు ఎత్తేశారు అని టాక్. 

ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు నిర్మాతలతో సినిమాని పోస్టుపోన్ చేసుకోండి అని విన్నవించినా వారి మాట వినకుండా విడుదల చేస్తున్నారు అని డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన. కరోన విపరీతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలా సినిమాని విడుదల చేసి కరోన వ్యాప్తి ని ఇంకా పెంచుతున్నారు అని సల్మాన్ సినిమా మీద అందరూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయం మీద ఇప్పటికే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: