ఎమ్ ఎస్ నారాయణ జీవించి ఉన్న కాలంలో నటించి ఒక సినిమాలో మందుబాబు పాత్రలో నటిస్తూ దేశంలో రియల్ ట్యాక్స్ పెయర్స్ మందుబాబులు మాత్రమే అనీ అలాంటి మందు బాబులకు దేశంలో సరైన గౌరవం లేదు అంటూ ఆ మూవీలో ఎమ్ ఎస్ నారాయణ చేత చెప్పించారు. అప్పట్లో ఆ డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయింది.


ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడటంతో మందుబాబులు భవిష్యత్ లో ఇక మందు దొరకదేమో అన్న భయంతో మందు సీసాల కోసం కలబడుతూ కరోనా భయం లేకుండా భౌతిక దూరాన్ని మర్చిపోయి మందుబాబులు చేస్తున్న హడావిడి మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఈవిషయం పై అనేకమంది ప్రముఖులు స్పందిస్తున్నారు.ఇప్పుడు ఈ లిస్టులోకి సింగర్ సునీత కూడ చేరిపోయింది.



కొన్ని నెలల క్రితం పెళ్ళి చేసుకున్న సునీత ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ సామాజిక విషయాల పై కూడ స్పందిస్తోంది. లాక్ డౌన్ పెడితే పరిస్థితులలో మార్పు వస్తుందని తాను భావించానని అయితే ప్రజల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.



ఇలా అన్నీ మర్చిపోయి జనం మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదని సునీత అభిప్రాయపడింది.  అంతేకాదు ఇది చాలా దురదృష్టకర సంఘటన అంటూ మందుబాబులకు కూడ కుటుంబాలు ఉంటాయి అన్నవిషయం వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది అంటూ చురకలు వేసింది. లాక్ డౌన్ ప్రకటన రాగానే మొదటిరోజు 100 కోట్లు రెండవరోజు 90 కోట్లు కేవలం తెలంగాణాలో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే ఈ రాష్ట్రంలో మందుబాబులు వల్ల ప్రభుత్వ ఖజానా కు ఏవిధంగా డబ్బు వస్తోందో అర్థం అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వాలు అన్నీ మందు ద్వారా వచ్చే పన్ను ను ప్రధాన ఆదాయ వనరులుగా పరిగణిస్తున్న పరిస్థితులలో ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా పరిస్థితులలో మార్పు రావడం జరగని పని..


మరింత సమాచారం తెలుసుకోండి: