సినీ ఇండస్ట్రీలోకి  ఎంతో మంది  హీరోలు కావాలనే ఆలోచన తో అడుగు పెడుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్డమ్ను సంపాదించుకుంటే మరికొంతమంది సినీ ఇండస్ట్రీ లోనే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత సినిమా హీరోలు ఎదిగిన వారు ఎంతమంది ఉన్నారు.. అలా వచ్చిన వారిలో కూడా కొంతమంది హీరోలుగా  నిలదొక్కుకుంటే,  మరికొంత మంది హీరోలు నిలవలేక పోతుంటారు. అంతే కాకుండా మరికొంత మంది మొదటిసారి విలన్ గా మెప్పించి, ఆ తరవాత హీరోగా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు. అయితే హీరో గోపీచంద్ కు  మే 14 చాలా ప్రత్యేకమట. అంటే ఈ రోజు ఎందుకో అంత ప్రత్యేకం.. అనే విషయం గురించి ఇప్పుడు  ఒకసారి తెలుసుకుందాం.


గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో "సిటీమార్"  సినిమా చేస్తున్నాడు. ఇక అలాగే  మారుతి దర్శకత్వంలో కూడా పక్కా కమర్షియల్ సినిమాని చేస్తున్నాడట. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గోపీచంద్ తన కుటుంబానికి చాలా దగ్గర గానే ఉంటాడు. గోపీచంద్  2013లో రేష్మా ను వివాహం చేసుకున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే, గోపీచంద్ తన  పెళ్లి రోజు మర్చిపోకుండా తన ఇంస్టాగ్రామ్ లో భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.


ఈ సందర్భంగా గోపీచంద్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా "  ఈ ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన బహుమతి మరొకటి లేనేలేదు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ చేశారు  గోపీచంద్. గోపీచంద్ ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే , మరొకవైపు తన కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటే చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇది కేవలం గోపీచంద్ జీవితంలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాగే ఉండాలి. ఒకవైపు మనం చేసే వృత్తి, మరొకవైపు మనల్ని నమ్ముకున్న కుటుంబం ఇలా  రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: