ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క పోనే సోనూసూద్‌. దేశ వ్యాప్తంగా ఆయ‌న చేస్తున్న సేవ‌లు అనిర్వ‌చ‌నీయం. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా నేనున్నాన‌ని సాయం చేస్తున్నారు సోనూసూద్‌. ఎంతో మంది కూలీల‌ను త‌మ సొంత ఊర్ల‌కు పంపంచారు. ఆ త‌ర్వాత క‌రోనా పేషెంట్ల‌కు త‌న‌వంతు సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ప్రతీ దశలోనూ సోన‌సూద్ సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక ఈయ‌న చేస్తున్న సేవ‌ల‌కు గాను సోషల్‌ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం ఇప్పటికీ కురుస్తూనే ఉంది.

సామాన్యులనుంచి రాజ‌కీయ నాయ‌కుల దాకా అంద‌రూ ఆయ‌న సేవలను మెచ్చుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోనూసూద్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. సోనూసూద్ రియల్‌ హీరో అంటూ ట్వీట్ కూడా చేసిన సంగ‌తి విదిత‌మే. అయితే ఇప్పుడు ప‌ద్మ అవార్డుల కోసం నామినేష‌న్లు స్వీక‌రిస్తుండ‌గా.. టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ ఏకంగా సోనుసూద్ఖ‌/ ప‌ద్మ శ్రీ ఇవ్వాలంటూ డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.




సోనూ సూద్ చేస్తున్న సేవ‌ల‌కు ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు ఇవ్వాలంటూ బ్ర‌హ్మాజీ ట్వీట్ చేశాడు. అలాగే తన డిమాండ్‌ను స‌పోర్టు చేసే వారంతా తన ట్వీట్‌కు రీట్వీట్ ఇవ్వాలంటూ కోరాడు. ఇక అంతే సంగ‌తి ఒక్క‌సారిగా ట్విటర్‌లో ఆ ట్వీట్‌కు రీట్వీట్ల సునామీ మొద‌లైంది. ఇక ఈ ట్వీట్ పై సోనూసూద్ వెరైటీగా స్పందించారు. త‌న‌కు 135 కోట్ల మంది భార‌తీయుల ప్రేమ, అభిమానమే అతిపెద్ద పుర‌స్కార‌మ‌ని స్ప‌స్టం చేశాడు.

తాను ఇప్ప‌టికే ఆ అవార్డును అందుకున్నాన‌ని వెల్ల‌డించాడు. అయితే బ్ర‌హ్మాజీ అభిమానానికి ధ‌న్యవాదాలు తెలిపాడు సోనూసూద్‌. ఇక ఈ ట్వీట్‌కు వేలాది ట్వీట్లు వ‌స్తున్నాయి. ఇక త్వ‌ర‌లోనే కేంద్రం నామినేష‌న్ల‌పై క‌స‌ర‌త్తు చేయ‌నుంది. దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలు అయిన ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ‌భూష‌న్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌కు నామినేష‌న్లు సెప్టెంబ‌ర్ 15 న లాస్ట్ డేట్ అని కేంద్రం తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: