సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం. అందులో విహరించాలని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారు. కానీ కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి.అయితే ఆ కలలు నిజం అయినాగానీ అవి శాశ్వతంగా ఉండవు. మధ్యలోనే కలలు కల్లలుగా మిగిలిపోతాయి. ఇందుకు ఉదాహరణ హీరోయిన్ బిందు మాధవి జీవితం. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కానీ అదృష్టం కొద్ది మన తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవికి తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మొదట అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ తరువాత టాలీవుడ్ లో అవకాశాలు రాక కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈరోజు మన బిందు మాదవి పుట్టినరోజు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం !


బిందు మాధవి మన తెలుగు అమ్మాయి. పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లాలో.ఆమె సినిమాల్లోకి రాకముందు  మోడలింగ్ చేస్తూ ఉండేది. ఆ తరువాత ముందుగా తెలుగు సినిమాల్లో నటించింది తరువాత తమిళ సినీ పరిశ్రమ వైపు దృష్టి మళ్ళించింది. అసలు బిందు మాదవికి సినిమాల్లో నటించే అవకాశం ఎలా వచ్చిందంటే.. మొదట్లో మోడలింగ్ కొనసాగిస్తూ అప్పుడప్పుడు టీవీలో  కొన్ని ప్రకటనల్లో నటిస్తూ ఉండేది. ఈ క్రమంలో టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో నటించింది. అలా బిందు మాదవి  శేఖర్ కమ్ముల దృష్టిలో పడింది. ఇంకేముంది బిందు మాదవికి తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.అలా బిందు మాదవి ఆవకాయ్ బిర్యానీ సినిమా ద్వారా తెలుగులో మన అందరికి పరిచయం అయింది.


ఆ తరువాత దర్శకుడుపూరి జగన్నాధ్ నిర్మాతగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రంలో బిందు మాదవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే  ఓం శాంతి,  దిల్ రాజు నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ , గౌతం మీనన్ శిష్యురాలైన అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన వప్పం అనే తమిళ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించింది.


ఈ సినిమాను తెలుగులో సెగ అనే పేరుతో రిలీజ్ చేసారు. అయితే తెలుగులో ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. కానీ వప్పం సినిమా తమిళంలో మంచి హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తరువాత నానికి జోడిగా పిల్ల జమిందార్ సినిమాలో కూడా నటించింది.ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తుంది. చూడపోతే ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.. !


మరింత సమాచారం తెలుసుకోండి: