మెగాస్టార్ చిరంజీవి హీరోగా డ్యాన్సర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శంకర దాదా జిందాబాద్. మంచి మాస్ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతంలో వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. 2007లో మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. కరిష్మా కోటక్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించారు.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్, శంకర్ దాదా గా అద్భుతంగా నటన కనబరచగా, ఆయనకు అనుచరుడైన ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ కూడా వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ చేసారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా వేరొక నటిని అనుకున్నప్పటికీ అప్పట్లో ఆమె డేట్స్ దొరక్క పోవడంతో ఆమె స్థానంలో కరిష్మా కోటక్ ని తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో టి ఎల్ కాంతారావు, సుందరం మాస్టర్, శరత్ బాబు, వేణు మాధవ్, షాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారు.
జాతకాలకి, నమ్మకాలకి విలువనిచ్చే తండ్రికి కొడుకుగా కనిపించే పవన్, శంకర్ దాదా ఒక మంచి మనిషిగా మారాడన్ని గౌరవించి పెళ్లి కూతురు జాతకం విషయంలో ఉన్న సమస్యలను లెక్కచేయకుండా ఆమెను వివాహమాడతాడు. చిన్న పాత్ర అయినప్పటికీ పవన్ పోషించిన క్యారెక్టర్ కి అప్పట్లో థియేటర్స్ లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి అంతకముందు వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ లోని నా పేరే కాంచన మాల సాంగ్ లో కొన్ని క్షణాలు కనిపిస్తారు పవన్. మొత్తంగా పవర్ స్టార్, మెగాస్టార్ కలిసి ఈ శంకర్ దాదా జిందాద్ మూవీలో యాక్ట్ చేయడంతో మెగాఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: