ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి ఊపులో ఉన్నాడు. చాలాకాలంగi సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కి ఈ సినిమా మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో రామ్ 19వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాని భారీ ఎత్తున  నిర్మించనున్నారు. తెలుగు తమిళ్ లో రాబోతున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకి వచ్చింది అదేంటి అంటే రామ్సినిమా కథ ఇప్పటిదాకా వినలేదు అంట. ఆయన ఈరోజే ఈ సినిమా కథ విని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు." లింగుస్వామి గారితో  మొదటి స్టోరీ నరేషన్ పూర్తి అయింది అని సూపర్ కిక్ వచ్చింది.. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయండి" అని రామ్ అన్నాడు.

 ఇక రామ్ కోసం డైరెక్టర్ లింగుసామి ఈ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందట.ఈ సినిమా ఫ్యాక్షనిజం నేపథ్యంతో అవుట్-అండ్-అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అని టాక్. ఈ సినిమా రామ్ ని హీరోలలో టాప్ లిస్ట్ కి తీసుకెళ్తుంది అని రామ్ అభిమానులు అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా ని నిర్మాతలు ఖర్చు కి వెనకడకుండా తియ్యబోతున్నారు అని టాక్. ఇక రామ్ ఈ సినిమాతో ఇంకొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కరోన పరిస్థితులు అన్ని చక్కపడటంతో ఈ సినిమా షూటింగ్ ని త్వరలోనే ప్రారంభించడానికి మూవీ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: