
టాలీవుడ్ లో సినిమాలలో మాత్రమే కాకుండా సీరియల్ లో కూడా ఒకే కుటుంవానికి చెందిన పలువురు నటీనటులు నటిస్తున్నారు. నేపోటిజం అంటూ బాలీవుడ్ లో చెలరేగిన ఓ వివాదం ఇప్పుడు టాలీవుడ్ కి పాకిన నేపద్యంలో వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై కూడా కుటుంబాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీరియల్ లు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అక్కాచెల్లెలు, అత్తాకోడళ్లు, భార్యభర్తల సెంటిమెంట్ తో చాలా సీరియల్ లు వస్తూ ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వనివ్వడం లేదు. కొన్ని కొన్ని సీరియల్స్ లలో వీరి అనుబంధాన్ని చూస్తే నిజజీవితంలో కూడా వీరికి ఇదే అనుబంధం ఉంటే బాగుంటుంది అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా కొన్ని సీరియల్స్ లలో చేసిన అత్తా కోడలు నిజజీవితంలో కూడా అత్తా కోడళ్లు గా ఉన్నారు. వారెవరో.. ఏ సీరియల్స్ లలో అత్తా కోడలు గా నటించారో ఇప్పుడు చూద్దాం .
రెండు దశాబ్దాలుగా యాంకర్ గా దుమ్మురేపుతున్న సుమ మొదట్లో సీరియల్స్ లో నటించారు. ఆమె భర్త రాజీవ్ కనకాల అమ్మ లక్ష్మీ కనకాల కూడా కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించారు. వెండితెరపై పలు మంచి పాత్రలు చేసిన సన బుల్లితెరపై కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె కొడుకు అన్వర్ భార్య సమీరా కూడా బుల్లితెరలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సంతోషిని ఎన్నో సీరియల్స్ లో నటించి వెండితెరకు పరిచయమయ్యారు ఈమె మామ ప్రసాద్ బాబు ఎన్నో సినిమాల్లో చేసి బుల్లితెరపై నటించారు. అంతే కాదు ఆయన భార్య కూడా సీరియల్స్ లో నటించారు. నటి శ్రీలక్ష్మి ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లి తెరకు పరిచయమయ్యారు. శ్రీ లక్ష్మీ తమ్ముడు రాజేష్ ఒకప్పుడు నటుడు. అంతేకాదు అతని కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా కౌసల్య కృష్ణమూర్తి , వరల్డ్ ఫేమస్ లవర్స్ వంటి సినిమాల్లో నటించింది. ఐశ్వర్య రాజేష్ శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు అవుతుంది.